- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Electric Cars: కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈవీ కొంటే రూ. లక్ష తగ్గింపు..ఈ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్

దిశ, వెబ్ డెస్క్: Electric Cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకు బిగ్ అలర్ట్. టాటా మోటార్స్ పాపులర్ ఎలక్ట్రిక్ మోడల్స్ పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన టాటా మోటార్స్ నాలుగు ఎలక్ట్రిక్ వాహనాల(Electric Cars)పై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ డివిజిన్(Tata Motors Electric Division), ఇండియన్ ఈవీ ఫోర్ వీలర్ మార్కెట్ లీడర్ గా ఉంది.
అయితే కంపెనీ దగ్గర టాటా టియోగో ఈవీ(Tata Tiago EV), పంచ్ ఈవీ(Punch EV), నెక్సాన్ ఈవీ(Nexon EV), కర్వ్ ఈవీ(Curve EV) మోడల్స్ స్టాక్ భారీగా మిగిలిపోయింది. దీంతో 2024లో తయారు అయిన ఈ నాలుగు ఈవీలపై టాటా మోటర్స్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మోడల్ ను బట్టి రూ. 40వేల నుంచి రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.
టాటా పంచ్ ఈవీ:
గత మాన్యుఫాక్చరింగ్ ఇయర్ 2024లో టాటా మోటార్స్ ఉత్పత్తి చేసిన పంచ్ ఈవీ స్మార్ట్, స్మార్ట్+ వేరియంట్ల(3.3 kW AC వాల్ బాక్స్ ఛార్జర్స్)పై రూ. 45,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. 3.3kW ఛార్జర్‌తో వచ్చే అన్ని ఇతర మీడియం-రేంజ్, లాంగ్-రేంజ్ వేరియంట్లపై రూ. 70,000 వరకు తగ్గింపు అందిస్తోంది. 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్ మోడల్ ధరపై రూ. 90,000 వరకు తగ్గింపు ఉంది. MY2025లో తయారైన పంచ్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
టాటా టియాగో ఈవీ :
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై మినిమం రూ.65,000వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ . ఇందులో రూ.50,000 టోటల్ డిస్కౌంట్ కాగా, రూ.15,000 అన్ని వేరియంట్లపై అందించే గ్రీన్ బోనస్ అని చెప్పవచ్చు. ఈ వెహికల్ లైనప్‌లోని 3.3 kW ఛార్జర్ LR వేరియంట్‌పై మ్యాగ్జిమం డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు దీనిపై రూ. 85,000 డిస్కౌంట్‌తో పాటు రూ. 15,000 గ్రీన్ బోనస్ కూడా లభిస్తుంది. అంటే ఓవరాల్ డిస్కౌంట్ రూ. 1,00,000 ఉంది. కస్టమర్లు MY2025 టియాగో EV మోడల్, XZ+ మినహా అన్ని వేరియంట్లపై రూ. 40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కానీ 3.3kW ఛార్జర్‌తో వచ్చే వేరియంట్లపై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
టాటా కర్వ్ ఈవీ:
టాటా మోటార్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెహికల్ . కర్వ్ ఈవీపై ఇప్పుడు రూ. 70,000 డిస్కౌంట్ కూడా ఉంది. గ్రీన్ బోనస్ 15,000తో కలిపి మొత్తం రూ. 85,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. కర్వ్ ఈవీ అన్ని వేరియంట్లపై ఈ డిస్కౌంట్స్ ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ:
ఈ సబ్ కాంపాక్ట్ SUVపై రూ. 40,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతేకాదుే కస్టమర్లు రూ. 15,000 బోనస్ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్లు MY24 మోడళ్లపై, లాంగ్-రేంజ్, మిడ్-రేంజ్ వేరియంట్లపై మాత్రమే వర్తిస్తాయి. టాటా నెక్సాన్ ఈవీ క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్, డార్క్ వంటి 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Read Also..