రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..
X

దిశ, మణుగూరు:
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరక గూడెం మండలంలో ఆటో, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే…. కరక గూడెం మండలం నీలాద్రీ పేట గండికి చెందిన సోడి సాగర్(25), మడివి బామన్ లు అదే మండలంలోని అంగారి గూడెం నకు చెందిన బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో వారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో కల్వల నాగారం గ్రామ సమీపంలో జామాయిల్ లోడ్ తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బామన్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి . దీంతో 108 ద్వారా పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story