- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా తగ్గిన ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని ఆటో విడిభాగాల పరిశ్రమ 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పనితీరులో చెత్త రికార్డులను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయం 11.7 శాతం తగ్గి సుమారు రూ. 3,49,637 కోట్లుగా నమోదు అయినట్టు ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ) వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు రూ. 3,95,902 కోట్లుగా ఉంది. వరుసగా మూడు సంవత్సరాల రెండంకెల వృద్ధి తర్వాత దేశంలో వాహనాల అమ్మకాల్లో మందగమనం కారణంగా ఆదాయ క్షీణత ఏర్పడింది.
గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం సంకోచం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 26 నుంచి 45 శాతం వరకు తగ్గుతాయని వాహన తయారీదారులు వెల్లడించారు. దీనివల్ల కాంపొనెంట్ పరిశ్రమకు మరో ఏడాదిపాటు కష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, దేశీయంగా ఎగుమతులు గణనీయంగానే ఉన్నాయి. రానున్న కొద్దిరోజుల్లో వ్యాపారం నిలదొక్కుంటుందని భావిస్తున్నట్టు, గత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగం మందగమనంలో ఉన్నప్పటికీ, కాంపొనెంట్ పరిశ్రమ విభాగం స్థిరంగా ఉంది. అయితే, ఒరిజినల్ పరికరాల తయారీ క్షీణించడం వల్ల ఈ కష్టాలను అధిగమించడానికి కొంత సమయం పడుతుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపక్ జైన్ అన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో ఖచ్చితంగా సంకోచాన్ని చూడనున్నం. కానీ, ఇది ఎంత మేరకు ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేమని దీపక్ జైన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమ కేవలం 15 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసింది. కాబట్టి, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి స్థాయిలో ఈసారి 30-35 శాతం క్షీణతతో ఏడాదిని ముగిస్తామన్నారు. పండుగ సీజన్ సమయంలో గతేడాది స్థాయికి చేరుకోగలమని నమ్ముతున్నట్టు దీపక్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు.