- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికొద్ది క్షణాల్లో బాల్య వివాహం.. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన అధికారులు
దిశ, మానకొండూరు : బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని భారత ప్రభుత్వం ఎంత పటిష్టంగా అమలు చేసినా సమాజంలో నేటికీ అడపాదడపా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో బాల్యవివాహాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. కారణం అక్కడ విద్యావ్యవస్థ పటిష్టంగా లేకపోవడమే అని తెలుస్తోంది. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని 2006 నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినా ఆశించినంత ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామంలో బాల్య వివాహాం జరుగుతుందని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న పోలీసులు, చైల్డ్ లైన్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని వివాహాన్ని ఆడ్డుకున్నారు.
వివరాల్లోకివెళితే.. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నంబాల -గూడెం గ్రామానికి చెందిన సుధాకర్ (29) అనే యువకుడికి వెల్ది గ్రామానికి చెందిన శారదా(16) అనే మైనర్‌ను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్ద నిర్ణయించారు. గురువారం కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు తహశీల్దార్ డి. రాజయ్య, స్థానిక సీఐ వై కృష్ణారెడ్డి తెలిపారు. వివాహం గురించి సమాచారం అందగానే అధికారులు అక్కడకు చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి మైనర్ మ్యారేజ్‌ను ప్రోత్సహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో సీడీపీఓ సబిత, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావ్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ సంపత్, ఎల్పీఓ రాజు, సూపర్వైజర్ విజయ తదితరులు పాల్గొన్నారు.