- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ బెల్ట్ షాపుల దందా.. నిషాలో తేలుతున్న మద్యం ప్రియులు
దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా సాగుతోంది. గ్రామంలో బహిరంగంగానే బెల్ట్ దుకాణాలు నడుస్తున్నప్పటికీ అడ్డుకో వాల్సిన సంబంధిత శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడంతో బెల్టుషాపు నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొంతమంది బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం ప్రియులకు వేలకు వేలు ఖాతాలు పెడుతూ అవి తీర్చని పక్షంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఇంట్లోని వస్తువులను సైతం తెప్పించి తనఖా పెట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నారంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ వేలా పాల లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండడంతో గ్రామస్తులు మద్యం మత్తులో ఊగుతున్నారు. దీంతో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. మద్యానికి బానిసై కొంతమంది అనారోగ్యాల పాలవుతూ మూడు పదుల వయసు దాటకుండానే తనువు చాలిస్తుండడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పెద్దకోడెపాక బెల్ట్ షాపుల నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.