విమానం కూలిన ఘటనలో అధికారుల దర్యాప్తు

by vinod kumar |
విమానం కూలిన ఘటనలో అధికారుల దర్యాప్తు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో విమానం కూలిన ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు అన్వేషణ మొదలుపెట్టారు. మొత్తం 13 హెలికాప్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్‌లతో గాలింపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 4 వేల 100 ప్రభుత్వం రంగంలోకి దింపింది. ముఖ్యంగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కోసం థౌసండ్‌ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో క్షుణ్ణంగా శోదిస్తున్నారు. ఇప్పటివరకు సముద్రంలో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. కాగా, ఘోర విమాన ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 62 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story