గాయంతోనే మ్యాచ్ గెలిచాడు

by Shiva |   ( Updated:2021-02-12 11:14:22.0  )
గాయంతోనే మ్యాచ్ గెలిచాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ 5వ రోజు అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. మూడో రౌండ్‌లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిజ్‌తో తలపడిన జకోవిచ్ రెండు సెట్లు వరుసగా గెల్చిన తర్వాత గాయపడ్డాడు. అయినా సరే పట్టు వదలక నొప్పితోనే మ్యాచ్ కొనసాగించాడు. మూడు, నాలుగు సెట్లు కోల్పోయినా మిగిలిన సెట్ గెల్చుకున్నాడు. ఫ్రిజ్‌పై 7-6(1), 6-4, 3-6, 4-6, 6-2 తేడాతో విజయం సాధించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. డోమినిక్ థీమ్ 4-6, 4-6, 6-3, 6-4, 6-4 తేడాతో నిక్ కిర్గియోస్‌పై గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

మూడో ర్యాంకర్ నయోమీ ఒసాక 6-3, 6-2 తేడాతో ఓనస్ జబేర్‌పై గెలిచి నాలుగో రౌండ్ చేరగా, సెరేనా విలియమ్స్ 7-6(5), 6-2 తేడాతో పొటాపోవాపై గెలిచింది. రెండో సీజ్ హెలెప్ కూడా రష్యాకు చెందిన వెరోనికా కుదెర్మెటోవాపై 6-1, 6-3 తేడాతో గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక వరల్డ్ నెంబర్ వన్ ఆష్ బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. సింగిల్స్‌పై ఫోకస్ చేయడానికే తాను వైదొలగుతున్నట్లు చెప్పింది. దీంతో శుక్రవారం జెన్నిఫర్ బార్డీతో కలసి ఆడాల్సిన మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో ఎలిస్ మెర్టెన్స్‌, సబలెంకాకు వాకోవర్ లభించింది.

Advertisement

Next Story