ఆ దేశంలో తెలుగు చదివితే 5మార్కులు కలుపుతారట..

by vinod kumar |
ఆ దేశంలో తెలుగు చదివితే 5మార్కులు కలుపుతారట..
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషు కల్చర్ పెరిపోతున్నది. కొన్నిచోట్ల అయితే తెలుగు మాట్లాడే వారిని చాలా చిన్నతనంగా చూస్తున్నారు. రోజురోజుకూ తెలుగు భాష అంతరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చాలా మంది తెలుగు పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు అమ్మ లాంటి తెలుగును బతికించుకోవడానికి ఎన్ని పోరాటాలైనా చేస్తామంటున్నారు. అలాంటి వారికోసం ఓ దేశం తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తుంది. అదేంటంటే.. ఆస్ట్రేలియాలో 12వ తరగతి వరకు తెలుగును ఐచ్చిక భాషగా ఎంచుకోవచ్చని తెలిపింది. అలా ఎంచుకున్నవారికి 5 మార్కులు అదనంగా కలుపుతామని ప్రకటించారు. అంతేకాకుండా జాతీయ ట్రాన్స్ లేటర్స్ మరియు ఇంటర్ ప్రెటర్స్ పరీక్ష రాసేవారు కూడా తెలుగును ఎంపిక చేసుకుంటే 5మార్కులు అదనంగా ఇస్తారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే తమిళ, హిందీ, పంజాబీ భాషలు ప్రభుత్వ గుర్తింపు పొందాయి.

Advertisement

Next Story