- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చూపు సరిగా లేదు.. అయినా సాధించాడు!
వైకల్యంతో పుట్టిన వారు అసాధ్యం అనుకునే పనులను సుసాధ్యం చేసినపుడు కలిగే ఆనందమే వేరు.. అలాంటి ఆనందాన్నే ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన నికేత్ దలాల్ పొందుతున్నాడు. కంటి చూపు సరిగా లేకపోయినప్పటికీ నికేత్, దుబాయ్‌లో జరిగిన ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ పోటీలో పాల్గొని విజయం సాధించాడు.
ఈ పోటీని పూర్తి చేసిన మొదటి విజువల్లీ ఛాలెంజ్డ్ అథ్లెట్‌గా 38 ఏళ్ల నికేత్ రికార్డు సృష్టించాడు. 1.9 కి.మీ.ల ఈత, 90 కి.మీ.ల సైకిల్ రైడ్, 21.1 కి.మీ.ల పరుగు పందెం కలిసి ఉండే ఈ ట్రయాథ్లాన్‌లో నికేత్‌కు తోడుగా అర్హాం షేక్ పాల్గొన్నాడు.
నికేత్, అర్హం కలిసి ఏడు గంటల 44 నిమిషాల్లో ట్రయాథ్లాన్ పూర్తి చేశారు. వైకల్యం ఉన్నవారి కేటగిరీలో వీరు రెండో స్థానంలో నిలిచారు. ఈ ఘనత సాధించిన భారతీయుల్లో మొదటివాడిగా నికేత్ నిలిచాడు.
మొదటిసారిగా 2005లో ఓ భారతీయుడు ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌లో విజయం సాధించాడు. తర్వాత 15 ఏళ్లకు తన ద్వారా ఈ విజయం సాధ్యమైందని, అది కూడా వైకల్యం ఉన్నవాళ్లలో తనే మొదటివాడు కావడం అదృష్టంగా ఉందని నికేత్ అన్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి భారతీయులు ముందుకు రావాలని కోరాడు.