- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ ఫండ్స్‌కు వేలం పాట
దిశ, ఖమ్మం రూరల్: అక్కడ పంచాయతీ ఫండ్స్‌కు స్థానిక రాజకీయ పార్టీల నాయకులందరూ కలిసి వేలం పాట నిర్వహించారంటే నమ్మశక్యం కావడం లేదా..ఇది నిజమండి..ఎక్కడో కాదు ఖమ్మం జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న ఖమ్మం రూరల్ మండలం గుర్రలపాడు పంచాయతీలో జరిగింది. 2018 జనరల్ ఎన్నికలకు ముందు రూరల్ మండలంలోని ఐదు పంచాయతీలను కార్పొరేషన్లో కలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికలకు ఈ ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. తరువాత స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కృషితో కార్పొరేషన్ లో కలిసిన ఐదు విలీన పంచాయతీలను పంచాయతీలుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం గేజిట్ జారీ చేసింది.
ఈ ఐదు పంచాయతీలకు కలెక్టర్ స్పేషల్ అఫీసర్లను నియమించారు. పంచాయతీల్లో ఉన్న ఫండ్స్‌తో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వీడీసీ తీర్మానాలు అవసరం ఉంది. గుర్రలపాడు పంచాయతీలో రూ.59 లక్షల వరకు ఫండ్స్ ఉన్నాయి. వీటికి అధికారులు ఎక్కడ ఏ పనులు చేయాలో అంచనాలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ గ్రామానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు కొందరు డ్రామాలు చేసి అట్టి ఫండ్స్‌కు వేలం పాట ఏర్పాటు చేసి రూ.7.90 లక్షలకు అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఇదేమిటి అంటే గ్రామంలో నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న ఆలయ అభివృద్ధి కోసమని చెప్పడం విడ్డురంగా లేదు మరి. అంతగా అతనికి దేవుని మీద భక్తి ఉంటే సొంతంగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ పంచాయతీ ఫండ్స్ వేలంలో దక్కించుకుని దానికి దేవుడి పేరు చెప్పడం ఇదేక్కడి న్యాయం అని ప్రజలు అంటున్నారు.
అధికారులు పంచాయతీలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆన్లైన్ టెండర్ నిర్వహించాలే తప్ప…ఇలా అధికారులు వేలం పాటను పరోక్షంగా ప్రొత్సహించడం వెనుక అసలు కథ అర్థం కావడం లేదు. ఆన్లైన్ టెండర్ నిర్వహించడం వలన పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ ఫండ్స్ వేలం వెనుక ఉన్న అధికారులేవురో నిగ్గుతేల్చి సంబంధిత వారిపై చర్యలు తీసుకుని, వేలం పాటను రద్ధు చేసి తగు ఆన్లైన్ టెండర్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.