- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అటెన్షన్.. ఆదివారం జనతా కర్ఫ్యూ’
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఆదివారం (మార్చి 22న) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాపై ప్రధాని మోదీ ఢిల్లీలో జాతినుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా స్వయం ప్రకటిత జనతా కర్ఫ్యూ పాటించాలన్నారు. వారం రోజుల పాటు వీలైనంత వరకు ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టోద్దని సూచించారు. నిత్యవసరాల కోసం మాత్రం అస్సలు దిగులు పడరాదన్నారు. ప్రజలకు కావాల్సిన వస్తువులను ఇళ్లకే చేరవేస్తామని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు బయటకు రావొద్దని చెప్పారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ హితవు పలికారు. కోవిడ్-19 కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వైరస్ ప్రభావంగా మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం మొత్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని.. మానవజాతిని కరోనా సంక్షోభంలో నెట్టిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. గత రెండు నెలల నుంచి మానవజాతి కష్టాల్లో ఉందని.. మనమంతా ఉమ్మడిగా కరోనాపై పోరాటం చేయాలన్నారు. కరోనాపై పోరాటానికి దేశ ప్రజల సహయం కావాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని పరిశోధనలు జరిగినా.. ఈ మహామ్మారికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌పై కరోనా ప్రభావం లేదనుకోవడం పొరపాటు అని అన్నారు. కరోనా సోకిన బాధితులను ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రజలు గ్రూపులుగా తిరగవద్దని.. ఏకంతంగా ఉండటం మేలని చెప్పారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. కొద్ది వారాల్లో భారత్‌లో కరోనా బాధితులు పెరగబోతున్నారని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ప్రధాని మోదీ సూచించారు.
tag:Attention, coronavirus, narendra modi, speech, Janata Curfew, Sunday, march 22