కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్య యత్నం.. కారణం అదేనా ?

by Aamani |   ( Updated:2021-10-25 03:02:18.0  )
కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్య యత్నం.. కారణం అదేనా ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఫిర్యాదులు స్వీకరించిన సమయంలోనే జరిగింది. పూర్తి వివరాలు బాధితుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జాక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన సాంబోజి గంగుబాయి ఆమె కోడలు మనుమడు యాదగిరి‌తో కలిసి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.

గ్రామంలోని స్వార్జితమైన కుటుంబం ఆస్తిని అమ్ముకునే సమయంలో మధ్యవర్తులు, కొనుగోలు దారులు తాత్సారం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజా ప్రతినిధి గొర్త రాజేందర్ రెండు సంవత్సరాల క్రితం నలభై ఒక్కొ లక్షలకు ఇంటిని కొనుగోలు చేస్తానని అడ్వాన్స్ కింద తన తల్లి 12 లక్షలు చెల్లించార‌న్నారు. మిగతా సొమ్ము ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో మరో వ్యక్తి రిజిస్ట్రేషన్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రెండు సంవత్సరాలుగా అడ్వాన్స్ పోను మిగతా సొమ్ము ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమకు, బాకీ ఇచ్చిన వారి నుంచి రోజురోజుకు వత్తిడి పెరుగుతుందన్నారు. 22న అడ్వాన్స్ రూపంలో రూ.12 లక్షలు ఇచ్చిన రాజేందర్ అనే వ్యక్తి బలవంతంగా మిగితా డబ్బులు ఇచ్చినట్లు సంతకాలు చేయించారని బాధితులు ఆరోపించారు. భూమి అమ్మకం కొనుగోలు విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ఏ అధికారులను సంప్రదించినా తమకు న్యాయం జరగదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు యాదగిరి తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ సీసాను లాక్కొని అతన్ని కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డి‌ని కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed