- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి బ్యాంకులో చోరీకి యత్నం
by Sridhar Babu |
X
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం శభాష్‌పల్లి గ్రామంలోని కేడీసీసీ బ్యాంకులో గురువారం రాత్రి కొంతమంది దుండగులు చోరీకి యత్నించారు. శుక్రవారం ఉదయం బ్యాంకును తెరిచిన అధికారులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో వేలు ముద్రలు తదితర ఆధారాలను సేకరించారు.
పోలీసుల వివరాల ప్రకారం… షట్టర్ తాళాలు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు గ్యాస్ కట్టర్ సహాయంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో వెనుదిరిగి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఎటువంటి నష్టం వాటిల్లలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story