పార్లమెంట్ ముట్టడికి బీసీ సంఘం నేతల యత్నం..

by Shyam |   ( Updated:2021-12-14 07:57:58.0  )
పార్లమెంట్ ముట్టడికి బీసీ సంఘం నేతల యత్నం..
X

దిశ, కల్వకుర్తి: జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెంటు ముట్టడికి యత్నించారు. మంగళవారం మధ్యాహ్నం జంతర్ మంతర్ నుండి ర్యాలీగా బయలుదేరిన బీసీ నాయకులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించగా పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని పార్లమెంటు వైపు వెళ్ళటానికి యత్నించిన నాయకులను అదనపు బలగాలతో అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా శశి కుమార్ మాట్లాడుతూ.. జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోగా ఇలా కేంద్ర బలగాలతో అడ్డుకోవటం చాలా దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించని కారణంగానే పార్లమెంట్ ముట్టడి చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ గణనపై నిర్ణయం తీసుకోవాలని, ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. లేనిపక్షంలో బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

బీసీ వ్యతిరేక విధానాలతో వ్వవహరిస్తే బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి కడతారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దివాకర్ గౌడ్, మణి మంజరి, మధులత, బాలరాజు గౌడ్, అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్, మహేందర్ నాయుడు,శేఖర్ గౌడ్, చింతపల్లి సతీష్,వీరమల్ల కార్తిక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story