- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ గిరిజన యాత్ర.. పోలీసులపై రాళ్లదాడి
దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ గిరిజన యాత్రలో భాగంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాట ఘర్షణకు దారి తీసింది. ఇదే సమయంలో గిరిజన యాత్రకు స్థానికులు కూడా భారీగా తరలివచ్చారు. అక్రమ కట్టడాలు నిర్మించారంటూ స్థానికులు గుర్రంపోడులోని షెడ్డులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసులపై పలువురు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితి మరిం క్లిష్టతరం కావడంతో బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని సూచించారు. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలు అయ్యాయి. ముఖ్యంగా రాళ్ళ దాడిలో కోదాడ డీఎస్పీ రఘు, కోదాడ టౌన్ ఎస్సై క్రాంతి కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ‘పోలీసులు మన వారే.. వారు లాఠీ చార్జీ చేసిన పడండి.. మీరు రాళ్లతో దాడి చేయొద్దు.. అని బండి సంజయ్ పదే పదే చెబుతున్న పలువురు రాళ్లతో దాడి చేయడం గమనార్హం.