- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భగ్గుమన్న బెంగాల్.. కేంద్రమంత్రి కాన్వాయ్‌పై అటాక్
దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టీఎంసీ గూండాలు దాడులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. హింసాత్మక ఘటనల వెనుక ఉన్నది బీజేపీయే అని మమతా బెనర్జీ చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పరిణామాల దృష్ట్యా గురువారం బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి వి.మురళీధరన్ కాన్వాయ్‌పై పలువురు దుండగులు దాడి చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ దాడిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ ధ్వంసం కాగా.. వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయి. దీంతో వి. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వచ్చారు.
ఇక ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ.. ‘వెస్ట్ మిడ్నాపూర్‌లో టీఎంసీ గూండాలు నా కాన్వాయ్‌పై దాడి చేశారు.. అద్దాలు పగులగొట్టారు.. పర్సనల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు.. వెంటనే నా ట్రిప్‌ను రద్దు చేసుకున్నాను’ అంటూ దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం విచారణ కోసం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటన మీద ఏ విదంగా స్పందిస్తుందో అన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
TMC goons attacked my convoy in West Midnapore, broken windows, attacked personal staff. Cutting short my trip. #BengalBurning @BJP4Bengal @BJP4India @narendramodi @JPNadda @AmitShah @DilipGhoshBJP @RahulSinhaBJP pic.twitter.com/b0HKhhx0L1
— V Muraleedharan (@VMBJP) May 6, 2021