టీఆర్ఎస్ కౌన్సిలర్‌ భర్తపై మూకుమ్మడి దాడి..

by Sumithra |
టీఆర్ఎస్ కౌన్సిలర్‌ భర్తపై మూకుమ్మడి దాడి..
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ భర్త, టీఆర్ఎస్ నాయకుడు వేల్పుగొండ రాజుపై బుధవారం రాత్రి దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. వేల్పుగొండ రాజు, అతని తమ్ముడు రవికి కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. రాజు తమ్ముడు రవి ప్రస్తుతం వరంగల్ నగరంలోని పోతన నగర్‌లో నివాసముంటున్నాడు. భూతగాదాల విషయంలో తమ్ముడు రవి అన్న రాజుకు బుధవారం సాయంత్రం కాల్ చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో రవి నర్సంపేటలో ఉంటున్న వేల్పుగొండ రాజుని తీవ్రంగా దూషించాడు.

దీంతో కోపోద్రిక్తుడైన రాజు ఏదో ఒకటి తేల్చుకుందామని తమ్ముని ఇంటికి వెళ్లాడు. కూర్చుని మాట్లాడుకుందామని ఇంటికి వెళితే తమ్ముడి ఫ్యామిలీ ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసినట్లు కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ ఆరోపించింది. పక్కాప్లాన్ ప్రకారం రవి, అతని బంధువులు కర్రలు, రాళ్లతో దాడి చేసి తన భర్తను తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపింది. దాడిలో తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని, మట్వాడా పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు రాజు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

Advertisement

Next Story