తన భార్యతో మాట్లాడుతున్నాడని సర్పంచ్ భర్తకు దేహశుద్ది.. చివరకు..

by Sridhar Babu |   ( Updated:2023-12-13 15:22:20.0  )
sarpanch-attacked
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అనుమానంతో సర్పంచ్ భర్తపై చేయి చేసుకున్న ఘటన ధర్మపురి మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామ సర్పంచ్ భర్త అశోక్.. ఓ మహిళతో మాట్లాడటాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తన భార్యతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఆమె భర్త.. అనుమానంతో అశోక్‌ను చితకబాదారు. అయితే తనకు రైతుబంధు పథకం ద్వారా వచ్చే డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో తాను సర్పంచ్ భర్త అశోక్‌ను పిలిచి మాట్లాడుతున్నాని సదరు మహిళ వివరించింది. ఈ క్రమంలోనే తన భర్త తప్పుగా అర్థం చేసుకుని అశోక్‌పై దాడి చేసినట్టు తెలిపారు

Advertisement

Next Story