- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్జీవీ ఆఫీస్‌పై అటాక్
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ కార్యాలయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు, ఓయూ జేఏసీ సభ్యులు దాడి చేశారు. తమతో ఒకసారి ఆర్జీవి మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న ఓయూ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల, ఆర్జీవీ పవర్ స్టార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 25న ఆర్జీవీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ సినిమాను నిలిపివేయాలని ఆందోళన చేస్తున్నారు. ఇదే ఆగ్రహంతో వారు కూడా ఆర్జీవీపై పరాన్న జీవి సినిమా తీస్తూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఇటీవల పవన్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మకు బహిరంగ హెచ్చరికలు చేసింది తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వారి హెచ్చరికలను ఖండించిన రామ్ గోపాల్ వర్మ తన ఇంటికి ఎవరైనా రావొచ్చని సవాల్ విసిరారు. గూగుల్ మ్యాప్‌లో తన ఆఫీస్ అడ్రస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చాడు. వార్నింగ్‌లు అందరూ ఇస్తారని.. కావాలంటే తన ఆఫీస్ మీద దాడి చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు.
అయితే, ఆయన వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇస్తూ.. పవన్ అభిమానులు, ఓయూ జేఏసీ విద్యార్థులు గురువారం బంజారాహిల్స్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌పై అటాక్ చేశారు. అయితే, ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఆయనపై దాడి చేయడానికి రాలేదని.. కేవలం మాట్లాడటానికే వచ్చామని ఓయూ విద్యార్థులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, ఓయూ విద్యార్థుల మధ్య వాదనలు కూడా పెరిగాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.