మహిళా ఆఫీసర్ పై దాడికి యత్నం.. అడ్డుకున్నందుకు విరిగిన డ్రైవర్ పన్ను

by Aamani |
Gayaalu12
X

దిశ, నిర్మల్ రూరల్: అటవీ శాఖ అధికారులపై దాడి జరిగిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డ్రైవర్ పై, బీట్ అధికారిపై అక్రమంగా ఇసుక తరలించే వ్యక్తులు దాడి చేసినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్ తెలిపారు. గాయపడిన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బీట్ మహిళ అధికారి అడ్డుకుంది. దీంతో ఆమెపై దాడి చేసేందుకు ఇసుక మాఫియా ప్రయత్నించింది. ఆ దాడిని అడ్డుకున్న మామడ రేంజ్ అధికారి డ్రైవర్ అంజన్నపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయని అటవీ అధికారులు తెలిపారు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. అశోక్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed