- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరెంత.. మీ చదువులెంత..? drunk and driveలో సీఐపై దాడి
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పోలీసులు మన వాహనం ఆపుతున్నారంటేనే లోపల కొంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది డ్రింక్ చేసి వాహనం నడుపుతున్నప్పుడు మన వాహనాన్ని పోలీసులు అడ్డుకుంటే ఎలా ఉంటుంది ఓ సారి ఆలోచించండి. అలాంటి డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పోలీసులు కారును ఆపితే.. మద్యం మత్తులో విధుల్లో ఉన్న పోలీసునే.. మమ్మల్నే ఆపుతారా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ బెదిరించి.. సీఐపైనే దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. సైబరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారు అటువైపుగా వేగంగా వస్తుండగా పోలీసు సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆపకుండా రివర్స్ వెళ్లడం గమనించిన పోలీసులు.. అప్రమత్తమై వాహనాలను అడ్డుగా పెట్టి కారును ఆపేశారు. ఈ క్రమంలో కారు లోపలున్న ఇద్దరికి బ్రీత్ అనలైజ్ చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.
కానీ, వారు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరించారు. పైగా.. మమ్మల్నే ఆపుతారా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ బెదిరించడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఆపై మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై సీఐ.. మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే, సీఐపై దాడికి పాల్పడిన వారిలో ఒకరు సివిల్ కాంట్రాక్టర్ కాగా మరొకరు వైద్యుడు. వీరిలో ఒకరు పోలీస్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారికి బంధువు అనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే నిందితులను కాపాడేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కేసు నమోదు అయిందా లేదా? నిందితులను అరెస్ట్ చేశారా, లేదా? అనే విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.