నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం

by vinod kumar |

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తెలకపల్లి మండలం గౌతపల్లికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్‌కు వలస వెళ్లి అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకురాగా స్థానికులు అనుమతించలేదు. కరోనా సోకి చనిపోయిందన్న అనుమానంతో.. గ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించొద్దని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి.. అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

tags: Woman Dead, Nagar Kurnool, Telakapalli, Kothapalli, Collector, Hyderabad

Advertisement

Next Story