ఆదాయం సరిపోవడం లేదా..? ఇలా చేస్తే నెలకు రూ.30 నుంచి 50 వేలు మీ సొంతం..!

by Harish |
ఆదాయం సరిపోవడం లేదా..? ఇలా చేస్తే నెలకు రూ.30 నుంచి 50 వేలు మీ సొంతం..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులు సామాన్యుడికి గుదిబండలా తయారయ్యాయి. నెలంతా కష్టపడితే వచ్చిన జీతమంతా రెంట్, నెలవారీ ఖర్చులతోనే సరిపోతుంది. తీరా చూస్తే మళ్లీ అడిషనల్‌గా నెలాఖరులో అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితిని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీరా ఇబ్బందుల్లో ఉన్నవారు సైడ్ ఇన్‌కమ్ ఉంటే అయిపోవు అని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా మీ ముందుకు..

ఇటీవల కొన్ని బ్యాంకులు ATM ఫ్రాంచైజీ బిజినెస్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఇది ఎలా చేయాలో కూడా అవగాహన కల్పిస్తారు. మీకు ఉండాల్సిందల్లా ఆ బిజినెస్ ఎలా చేయాలి. డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే పట్టుదల ఉంటే చాలు.. మంచి రాబడి మీ సొంతం అవుతుంది.

ప్రస్తుతం ఏటీఎం ఫ్రాంచైజీలను టాటా ఇండీక్యాష్, హిటాచి, ముత్తూట్ ఏటీఎం, ఇండియా-1 ఏటీఎం వంటి కంపెనీలు ATM ఫ్రాంచైజీ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. మీరు వీటిల్లో నచ్చిన ఏటీఎం ఫ్రాంచైజీని ఎంపిక చేసుకోవచ్చు.

ముందుగా మీరు ఉండే ఏరియాలో ఎక్కడ ఏటీఎం సెంటర్ పెడితే బాగా నడుస్తుందో ఎంక్వరీ చేసుకోవాలి. ఫలానా సెంటర్‌లో పెడితే కస్టమర్లు బాగా వస్తారో అక్కడ సెంటర్ ఓపెన్ చేసి వివరాలు ఆయా బ్యాంకులకు వివరించాలి. దానికి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో రూ.2 లక్షల రిఫండబుల్ డబ్బులు చెల్లించాలి. ఇక ATMలో రూ.3 లక్షలు నిల్వ ఉంచాలి. వాటిని రోటెషన్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఏటీఎంలో నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటే.. వారి ఖాతా నుంచి డబ్బులు మీ కరెంట్ అకౌంట్‌కు యాడ్ అవుతాయి. ఈ డబ్బులను మీరు బ్యాంక్ నుంచి తీసుకొని మళ్లీ ఏటీఎంలో పెట్టాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్.

అయితే, కస్టమర్లు ATM ద్వారా చేసే ప్రతి లావాదేవికి కమిషన్ వస్తుంది. నగదు లావాదేవికి రూ.8, నగదు రహిత ట్రాన్సాక్షన్‌కు రూ.2 కమిషన్ వస్తుంది. ఇలా మీ ఏటీఎం ద్వారా రోజుకు 250 లావాదేవిలు జరిగినా.. మీకు నెలకు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు రాబడి మీ సొంతం. ఇంకా ఎక్కువ మంది మీ ఏటీఎంకు వస్తే.. మరింత ఎక్కువ ఆదాయం సంపాదించొచ్చు. అయితే, ఎందుకు లేట్ మరి.. త్వరపడండి..

Advertisement

Next Story

Most Viewed