ఏటీఎం కేంద్రాల్లో నో సేఫ్టీ !

by Shyam |   ( Updated:2020-04-08 07:55:00.0  )
ఏటీఎం కేంద్రాల్లో నో  సేఫ్టీ !
X

దిశ, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భూతంలా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య పరమైన ఏర్పాట్లను భేష్ గానే నిర్వహిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిస్థితుల్లోనే ప్రజల జీవనానికి ముఖ్యమైన డబ్బును విత్ డ్రా చేసుకునే ఏటీఎం కేంద్రాలు వైరస్ వ్యాప్తికి దోహదపడేలా ఉన్నాయా అంటే.. అవుననే అంటున్నారు పలువురు వినియోగదారులు.

ఏటీఎంల వద్ద క్యూ

కరోనా వైరస్ వ్యాప్తి వ్యక్తిగత శుభ్రత సరిగా లేకపోవడం వల్లనే వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం, వైద్యులు పదే పదే చెబుతున్నారు. దేశమంతా లాక్‌డౌన్ అమలు అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రధాన రహదారులు, నివాసిత ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా వారి ఉద్యోగాలకు దూరమై ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో సంపాదన లేనందున బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడమే ఏకైక మార్గం కన్పిస్తోంది. ఈ క్రమంలో తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం మిషన్ల వద్ద క్యూ కడుతున్నారు.

ప్రధాని మోడీ మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించినప్పటినుంచి దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అప్పట్నుంచి ప్రజలు తమ విధులకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో భవిష్యత్‌లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆలోచిస్తూ ముందుగానే బ్యాంక్‌లో డబ్బును డ్రా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల వద్ద వాచ్‌మెన్‌ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు క్యూ పద్ధతి పాటించడం లేదు. ఏటీఎం గదులను ఊడ్చకపోవడంతో పాటు, శానిటైజర్స్ అందుబాటులో లేవు. దీంతో ఏటీఎం బటన్స్ నొక్కే క్రమంలో వినియోదారులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఏటీఎం కేంద్రాల వద్ద కనీస ఏర్పాటు చేయాలని ఖాతారుదారులు కోరుతున్నారు.

Tags: corona virus, lockdown, ATM centers, March 22, Janata curfew, banks, sanitizers

Advertisement

Next Story

Most Viewed