బాలీవుడ్ బాద్‌షాతో లేడీ సూపర్‌స్టార్..?

by Jakkula Samataha |
బాలీవుడ్ బాద్‌షాతో లేడీ సూపర్‌స్టార్..?
X

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్‌తో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘బిగిల్’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించిన నయనతార మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్-అట్లీ కాంబినేషన్‌లో రానున్న అప్‌కమింగ్ మూవీలో ఈ లేడీ సూపర్‌స్టార్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుండగా.. అఫిషియల్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాకు మాస్టర్ పీస్ మ్యూజిషియన్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్టు గతంలో వినిపించగా.. డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ క్రేజీ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్‌లో నటించనుండగా.. కాస్ట్ అండ్ క్రూ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి షారుఖ్ ‘పఠాన్’ షూటింగ్‌లో పాల్గొంటుండగా.. నయనతార సౌత్‌లో ‘అన్నత్తే, కాతు వాకుల రెండు కాదల్, నిజాల్’ సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

Next Story