- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐఎస్ఎల్ ఫైనల్‌లో ఏటీకే మోహన్‌బగాన్
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020/21 సీజన్ ఫైనల్‌లోకి ఏటీకే మోహన్‌బగాన్ జట్టు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ముంబయి సీటీ జట్టుతో మార్చి 13న జరిగే ఫైనల్‌లో మోహన్ బగాన్ జట్టు తలపడనున్నది. మంగళవారం ఫటోర్డా స్టేడియంలో జరిగిన సెకెండ్ లెగ్ రెండో సెమీస్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో ఏటీకే మోహన్‌బగాన్ తలపడింది. టాస్ గెలిచిన మోహన్‌బగాన్ జట్టు ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. 38వ నిమిషంలో రాయ్ కృష్ణ ఇచ్చిన పాస్‌ను డేవిడ్ విలియమ్స్ గోల్‌గా మలిచి మోహన్‌బగాన్‌కు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. 68వ నిమిషంలో మరోసారి రాయ్ కృష్ణ పాస్ చేయడంతో మన్వీర్ సింగ్ గోల్ చేసి 2-0 ఆధిక్యాన్ని అందించాడు.
74వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ స్ట్రైకర్ సుహైర్ వడక్కపీడియా గోల్ చేసి మ్యాచ్‌పై ఆశలు రేపాడు. కానీ ఆ తర్వాత నార్త్ఈస్ట్ జట్టు మరో గోల్ చేయలేకపోయింది. చివర్లో మోహన్‌బగాన్ జట్టుకు పెనాల్టీ లభించినా.. గోల్ చేయడంలో విఫలమయైంది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఏటీకే మోహన్ బగాన్ 2-1 తేడాతో విజయం సాధించి వరుసగా రెండో సారి ఐఎస్ఎల్ ఫైనల్ చేరింది. రాయ్ కృష్ణకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, మన్వీర్ సింగ్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలోని టాప్ 2 జట్లే ఫైనల్స్‌కు చేరుకున్నాయి.