ఆథర్ ఎనర్జీలో రూ. 259 కోట్ల పెట్టుబడులు

by Harish |   ( Updated:2020-11-08 05:16:58.0  )
ఆథర్ ఎనర్జీలో రూ. 259 కోట్ల పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు కేంద్రంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉత్పత్తి చేస్తున్న ఆథర్ ఎనర్జీ సుమారు రూ. 259 కోట్ల పెట్టుబడులను సాధించింది. 2016 నుంచి ఆథర్ ఎనర్జీ వృద్ధిలో భాగస్వామ్యం కలిగిన హీరో మోటోకార్ప్ సుమారు రూ. 88.8 కోట్లను, హీరో మోటోకార్ప్ పెట్టుబడులు కలిగిన సిరీస్ డి ఫండింగ్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచి బన్సాల్ సూమరు రూ. 170 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

తాజా పెట్టుబడులతో దేశీయంగా భవిష్యత్తులో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాలా ఉత్పత్తిని పెంచేందుకు వినియొగించనున్నట్టు ఆథర్ ఎనర్జీ కంపెనీ తెలిపింది. ‘దేశవ్యాప్తంగా ఆథర్ ఎనర్జీ కొత్త ఉత్పత్తులు, విస్తరణ ప్రణాళికలపై నమ్మకముంది. 2014 నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ విభాగంలో దూసుకెళ్తున్న ఆథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కలిగి ఉండటం సంతోషంగా ఉందని’ సచిన్ బన్సాల్ పేర్కొన్నారు.

‘ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తు మార్పులో భాగం కానున్నాయి. ఇందులో ఆథర్ ఎనర్జీ కీలకపాత్ర పోషించడం గర్వంగా ఉంది. తాజా పెట్టుబడులతో మరింత వేగంగా ఉత్పత్తులను, వృద్ధిని సాధించగలమని’ ఆథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తెలిపారు.

Advertisement

Next Story