- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి చేసుకోబోతున్న అధర్వ.. అమ్మాయి?
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ తమిళ హీరో.. తనకన్నా ముందే తమ్ముడు పెళ్లి చేసుకోవడంతో తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. ఈ క్రమంలో గోవాకు చెందిన అమ్మాయితో గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తుండగా.. తననే పెళ్లి చేసుకుని సెట్ అయిపోవాలి అనుకుంటున్నట్టుగా కోలీవుడ్ టాక్.
కాగా తాజాగా ‘తల్లి పొగతె’ చిత్రాన్ని ప్రకటించాడు అధర్వ. నేచురల్ స్టార్ నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమాకు ఇది రీమేక్ కాగా.. అనుపమ పరమేశ్వరన్, అమితాష్ ప్రధాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనుపమ.
Next Story