- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల పట్ల బరితెగిస్తే.. బడితపూజ ఖాయం: అచ్చెన్నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే.. వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ మహిళా సర్పంచ్ మల్లీశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీ మూకల దాడిని అచ్చెన్నాయుడు ఖండించారు.
మహిళా హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్న వారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితపూజ ఖాయమని హెచ్చరించారు. వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. వారి అరాచకాలు ఇక సాగవని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేన్న విషయం వైసీపీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సర్పంచ్ మల్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డ వారిని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
- Tags
- atchannaidu