- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చేసింది అంతా అచ్చెన్నాయుడే’
దిశ ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకల్లో నిందితుడైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే జరిగాయని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, ఈ నేరంలో ఆయనే ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి కూడా ఆయా కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్లు కోర్టుకు వెలడించారు. ఈ వివరాలన్నీ కూడా దిగువ కోర్టుకు సమర్పించామని ఆయన తెలిపారు. 2016 సెప్టెంబరు 25న మంత్రి హోదాలో ఆయన నివాసంలో, ఆయన సమక్షంలో జరిగిన సమావేశం ఉద్దేశం ఏంటి? అన్నదానిని న్యాయస్థానం చూడాలని, ఆ మీటింగ్ మినిట్స్‌ను కూడా పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమావేశానికి హాజరైనవారందర్నీ అదుపులోకి తీసుకున్నామని ఆయన న్యాయస్థానానికి వివరించారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ వాయిదా వేసింది. వాయిదా తేదీ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.