- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోక్యో ఒలంపిక్స్ ఆర్చరీ బృందం ఇదే
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లే ఆర్చరీ బృందం ఎంపిక పూర్తి చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూణేలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో నిర్వమించి మూడో ట్రయల్స్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులను ఆర్చరీలో భారత్ తరపున పంపిస్తున్నట్లు సాయ్ తెలిపింది. అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్‌తో పాటు దీపికా కుమారి ఈ జాబితాలో ఉన్నారు. ఇక ట్రయల్స్ ద్వారా ప్రవీణ్ జాదవ్, అంకిత భకత్, కోమొలికా బరి కూడా భారత బృందంలో చోటు సంపాదించారు.
గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన రెండో ట్రయల్స్ సందర్భంగా సాధించిన పాయింట్లను కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు సాయ్ తెలిపింది. 2019లో నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం గెలుచుకున్న భారత పురుషుల ఆర్చరీ బృందం ఇప్పటికే టోక్యో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నది. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్యారిస్‌లో జరిగే క్వాలిఫయర్స్‌లో రాణిస్తే మహిళల బృందం కూడా అర్హత సాధిస్తుంది. అయితే వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి ఇప్పటికే అర్హత సాధించింది.