ఆ ఊళ్లో.. బతుకమ్మ సంబరాలు ఆరంభం

by Anukaran |   ( Updated:2023-10-14 14:56:13.0  )
ఆ ఊళ్లో.. బతుకమ్మ సంబరాలు ఆరంభం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: బతుకమ్మ సంబరాల ప్రారంభానికి మరో ఐదు రోజుల ముందుగానే ఆ ఊళ్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. వివరాలలోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ మహిళలు శనివారం బతుకమ్మ చీరలను ధరించి సాంప్రదాయ రీతిలో బతుకమ్మలను పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక ముందు మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలు, కోలాటాలు వేశారు.

బతుకమ్మ పాటల కు అనుగుణంగా చేసిన నృత్యాలు, కోలాటాలు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితర నేతలను ఆనందంలో ముంచెత్తారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన కుందామని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రానున్న బతుకమ్మ సంబరాలు మనందరికీ మరిన్ని ఆనందాలు తీసుకు రావాలని ఆకాంక్షిద్దాం అని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు మనే మోని సత్యనారాయణ స్థానిక నేతలు సత్యనారాయణ, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed