సీఎస్‌ను కలిసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం

by Shyam |
CS Somesh Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగులో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరింది. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఖాళీగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ పోస్టులను పదోన్నతులు, అడహక్ పద్ధతిని భర్తీ చేయాలని సంఘం అధ్యక్షుడు కె.చంద్రమోహన్ కోరారు.

సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు కమర్షియల్ ట్యాక్సెస్, పురపాలక శాఖలోని అదనపు కమిషనర్, అదనపు డైరెక్టర్ మాదిరిగా పే స్కేలు అమలు చేయాలన్నారు. ఫస్ట్ తెలంగాణ రివిజన్ కమిషన్ కూడా నాన్ క్యాడర్ కలెక్టర్ పోస్టులకు సిఫారసు చేసిందన్నారు. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సరైన పోస్టింగ్స్ ఇవ్వాలన్నారు. ఐఏఎస్ క్యాడర్ కోసం అడహక్ డిప్యూటీ కలెక్టర్ల సర్వీసును కూడా గణించాలన్నారు. మానవత్వ దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎస్ ను కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఎ.భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed