- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉభయ సభలు ప్రోరోగ్ : తమిళి సై
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆరవ సెషన్, శాసనమండలి 16వ సెషన్ సమావేశాల ప్రక్రియ నవంబరు 13వ తేదీతో ముగిసినట్లు ఆ నోటిఫికేషన్‌లో గవర్నర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 7వ తేదీన మొదలైన వర్షాకాల సమావేశాలు కరోనా కారణంగా షెడ్యూలు ప్రకారం నిర్దేశించుకున్న గడువుకంటే ముందే ముగిశాయి. అదే విధంగా శాసనమండలి సమావేశాలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. కానీ గవర్నర్ ప్రోరోగ్ చేయకపోవడంతో ఆ సమావేశాల కొనసాగింపులో భాగంగా కొత్త రెవెన్యూ (ఆర్వోఆర్) చట్టానికి సవరణలు చేసే బిల్లులపై చర్చ జరిగిన అనంతర, ఉభయ సభల ఆమోదం లభించింది. ఆ తర్వాత సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినా గవర్నర్ ప్రోరోగ్ చేయలేదు. కానీ నవంబరు 13వ తేదీ నుంచి ప్రోరోగ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువరించడంతో మళ్ళీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుంది.
ఆర్డినెన్సు కోసమే ప్రోరోగ్ నోటిఫికేషన్?
ధరణి పోర్టల్ వినియోగంలోకి వచ్చిన తర్వాత సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడంలో చట్టపరంగా, సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని చిక్కులు తలెత్తాయి. చట్టపరమైన చిక్కులను తొలగించుకోవాలంటే అక్టోబరులో కొత్తగా తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టానికి మళ్ళీ సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ చట్ట సవరణ జరగాలంటే ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఉన్న ఆచరణాత్మక ఇబ్బందుల దృష్ట్యా ఆ అవసరం లేకుండా ఆర్డినెన్సు ద్వారా వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రస్తుత సమావేశాలు పూర్తిస్థాయిలో ముగిసిపోయినట్లుగా ప్రోరోగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రోరోగ్ నోటిఫికేషన్ లేకుండా ఆర్డినెన్సు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.