గువహతిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్

by Shamantha N |   ( Updated:2020-06-26 04:29:18.0  )
గువహతిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్
X

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక కేసులున్న అసోం కట్టడి చర్యలను ఉధృతం చేస్తున్నది. గువహతి హెడ్‌క్వార్టర్‌గా ఉన్న కామరూప్ జిల్లాలో రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనుంది. ఈ నెల 28 అర్థరాత్రి నుంచి 14 రోజులపాటు ఈ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఈ కాలంలో కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనూ వారాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. టౌన్ కమిటీలు, మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ అమలవుతుందని, తదుపరి నోటీసు విడుదల చేసే వరకు ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో 6,321 కేసులు నమోదవ్వగా, తొమ్మిది మంది ఈ కరోనాబారిన పడి ప్రాణాలుకోల్పోయారు.

Advertisement

Next Story