ఫుల్‌గా తాగించి మోడల్‌ను నగ్నంగా చిత్రీకరించిన డైరెక్టర్.. వీడియో వైరల్

by Sumithra |
Aspiring model sedated
X

దిశ, సినిమా : హీరోయిన్‌గా బ్రేక్ ఇస్తామని ప్రామిస్ చేశారు. స్క్రీన్ టెస్ట్ అంటూ నమ్మించారు. మత్తుమందు ఇచ్చారు. ఫుల్‌గా తాగించారు. చివరకు ఓవర్ డోస్‌తో డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా వీడియో తీశారు. ఈ న్యూడ్ వీడియో బయటకు వెళ్లకుండా ఉండాలంటే తాము చెప్పినట్లుగా పోర్న్ వీడియోల్లో నటించాలని డిమాండ్ చేశారు. లేదంటే రూ. 5లక్షలు చెల్లించాలని ఫోర్స్ చేశారు. దీంతో సందిగ్ధంలో పడిన మోడల్ కొన్ని రోజులు ఈ విషయం గురించి ఆలోచించినా.. తర్వాత పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఈ ఘటన బాధితురాలు దివ్యా వర్మ విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వైష్ణవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మాతలు తనను హీరోయిన్‌గా లాంచ్ చేస్తారని హామీ ఇచ్చారని ఆ తర్వాత కొందరు కొలీగ్స్‌తో పరిచయం చేయించారని తెలిపింది. ఫైనల్‌గా స్క్రీన్ టెస్ట్ పేరుతో ఓ గెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లి.. అక్కడ డ్రింక్ తాగించి, మత్తు మందు ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత కాస్ట్యూమ్ ఇచ్చి రూమ్‌లోకి వెళ్లి చేంజ్ చేసుకోమన్నారని.. ఈ క్రమంలోనే సీక్రెట్‌గా వీడియో తీశారని చెప్పింది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ జరుగుతుందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విభూతి ఖండ్ ఎస్‌హెచ్‌ఓ శేఖర్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story