- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఉరితీత ప్రదేశం ఉందా?
నేరాలు జరుగకూడదని అభిలషించే సమాజం మనది. జైళ్లు అక్కరలేని రోజులు రావాలని కోరుకుంటాం. కానీ, ఇపుడు ఏకంగా ఉరితీత కేంద్రం కావాలని అనివార్యంగా అడగాల్సి వస్తున్నది. దాని కోసం దిక్కులు చూడక తప్పడం లేదు. రేప్ చేసి, ఘోరంగా చంపేస్తున్న కిరాతకులకు ఉరి శిక్షలు పడుతున్నాయి. వారంలోనే రెండు చోట్ల డెత్ పెనాల్టీలు ఖరారయ్యాయి. ఆసిఫాబాద్‌లో ముగ్గురు, నల్లొండలో ఒకడికి క్యాపిటల్ పనిష్మెంటు పడింది. వరుసగా మరణ దండన తీర్పులు వెలువడ్డాయి. ఆ మరణ శిక్షల అమలే మిగిలింది. అవి త్వరగా కళ్ల జూడాలని అనేక మంది జనం వేచి చూస్తున్నారు. అప్పీళ్లకు వెళ్లే వెసులుబాటు ఉండకూడదని బాధిత కుటుంబాలు, ఇతర వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరో వంక జడ్జిమెంట్ అమలు ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా తెలంగాణలో ఉరితీతకు అనువైన చోటు ఎక్కడ ఉన్నదనే టాపిక్ నడుస్తోంది. తలారి(ఉరి తీసే వారు)తోపాటు స్థలం, ఉరి నిర్మాణం వంటివి చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏ
జైలులోనూ ఆ ఏర్పాట్లు లేవట.
ముషీరాబాద్ సెంట్రల్ జైలు మాయం
బ్రిటీష్ పాలన నాటి ముషీరాబాద్ (హైదరాబాద్) సెంట్రల్ జైలును..2003లో కూల్చివేశారు. ఆ ప్లేసు గాంధీ హాస్పిటల్ నిర్మాణానికి పనికొచ్చింది. సదరు చెరసాలను సిటీ శివార్లలోని చెర్లపల్లికి సాగనంపారు. ఇంతకీ స్పెషల్‌గా ముషీరాబాద్ జైలు సంగతి ఎందుకంటే, దాంట్లోనే ఉరి శిక్షకు చోటుండేది. ఆ జైల్లోనే అపుడెపుడో 1975 డిసెంబరు 1న ఉరి తీశారట. డెత్ పెనాల్టీ ఇంప్లిమెంటేషన్‌కు ఆదేశాలు వస్తే గనక..నెల రోజుల్లోగా తగిన అరేంజ్మెంట్స్ చేస్తామని జైళ్ల శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు!