- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన అర్జున్ లాల్, రవి
దిశ, స్పోర్ట్స్: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా నిర్వహిస్తున్న ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్ 2021లో భారత పురుషుల డబుల్స్ జోడి అర్జున్ లాల్ జాట్ – రవి స్వర్ణ పతకం సాధించాడు. శనివారం రాయల్ థాయ్ నేవీ రోయింగ్ సెంటర్‌లో జరిగిన జరిగిన డబుల్స్ స్కల్ ఈవెంట్‌లో భారత రోయర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. చైనాకు చెందిన క్వింగ్ లీ- లుటోంగ్ ఝాంగ్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డావ్జోన్ – అబ్దుల్లో లను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత జోడి 6 నిమిషాల 57 సెకెన్లలో లక్ష్యాన్ని చేరారు. చైనా జోడీ 7 నిమిషాల 2 సెకెన్లలో చేరి రజత పతకం, ఉజ్బెకిస్తాన్ జోడి 7 నిమిషాల 7 సెకెన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక మెన్స్ సింగిల్స్ స్కల్ ఈవెంట్‌లో భారత రోయర్ పర్మీందర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో ఉజ్బెకిస్తాన్ రోయర్ స్వర్ణ పతకం, ఇండోనేషియా రోయర్ కాంస్య పతకాలు సాధించారు.