ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ యూఏఈకి తరపింపు

by Shiva |
ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ యూఏఈకి తరపింపు
X

దిశ, స్పోర్ట్స్: ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను దుబాయ్‌కి తరలించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 21 నుంచి 31 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ చాంపియన్‌షిప్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో దుబాయ్‌కి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చాంపియన్‌షిప్ దుబాయ్‌లో నిర్వహించినా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కో-హోస్ట్ గా ఉంటుందని ఏసియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆసియా ఖండానికి చెందిన పురుష, మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు.

Advertisement

Next Story