మద్యం మత్తులో రోడ్డు మీదే ఆ పని చేసిన ఏఎస్‌ఐ

by Anukaran |
మద్యం మత్తులో రోడ్డు మీదే ఆ పని చేసిన ఏఎస్‌ఐ
X

దిశ , పెద్దపల్లి : ప్రజలను కాపాడాల్సిన పోలీసు మద్యం మత్తులో తూలుతూ.. రోడ్డు పై పడుకున్న సంఘటన సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. తాగిన వ్యక్తులను అదుపులో పెట్టాల్సిన ఏఎస్ఐ నాగయ్య మద్యం మత్తులో రాత్రి 10 గంటల సమయంలో అపస్మారకస్థితిలో రోడ్డుపై పడుకుని ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు ఆటోలో కరీంనగర్‎లోని ఆయన ఇంటికి పంపించారు. డ్యూటీ టైంలో కూడా మద్యం తాగుతూ ఉంటాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించాలి.. కానీ ఇలా మద్యం సేవించి రోడ్డుపై పడుకోవడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మద్యం మత్తులో ఏఎస్ఐ రోడ్డు పై పడుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది. సామాన్యుడు మద్యం మత్తులో ఉంటే లాఠీకి పనిచెప్పే పోలీసులు ఓ పోలీసు అధికారి ఇలా చేయడంతో ఎలా ట్రీట్ చేస్తారో వేచి చూద్దాం.

Advertisement

Next Story