- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిర్లక్ష్యమే ASI నిండు ప్రాణాన్ని బలిగొన్నదా..?
దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యం వల్లే ఏఎస్సై హరిలాల్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ వైపు వెళ్తున్న ఇసుక లారీ మైలారం వద్ద డౌన్‌లో గల రహదారిపై ఎటువంటి సిగ్నల్ లేకుండానే నిలిచి ఉంది. అది గమనించని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెనుక వైపు నుండి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై వాహనాలను నిలుపిన యెడల ఇండికేటర్స్ వేయడంతో పాటు చుట్టూ ప్రమాద హెచ్చరికలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లారీ డ్రైవర్ ఇవేమీ పాటించకుండానే రోడ్డు వైపు నిలుపుదల చేయడంతో.. రాత్రి వేళలో పెట్రోలింగ్‌కు వెళుతున్న పోలీస్ వాహనము భూపాలపల్లి నుంచి రేగొండ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం బలైంది. లారీ వెనుక భాగాన్ని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏఎస్‌ఐ తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. డ్రైవర్ ఉమర్, మరో వ్యక్తి అశోక్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడేండ్లుగా రేగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై హరిలాల్ అక్కడి ప్రజలతో మమేకమయ్యే వారని మండల వాసులు చెబుతున్నారు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు. వీరు వరంగల్‌లోని శివ నగర్‌లో నివాసముంటున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఘన్పూర్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.
ఇసుక లారీలపై పర్యవేక్షణ కరువు..
వరంగల్ 353 జాతీయ రహదారి పై ప్రయాణించే ఇసుక లారీల వేగానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లాలోని మహాదేవపూర్ వద్ద గల గోదావరి నుంచి ఇసుక లారీలు హైదరాబాద్, వరంగల్ ప్రాంతానికి ఇసుకను తరలిస్తున్నారు. అధిక లోడుతో పాటు అధిక వేగంతో లారీలు వెళ్లడంతో రోజుకో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం పై పర్యవేక్షణ లేకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై ఎంతో మంది ప్రమాదాల బారిన పడి మృతి చెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది పిల్లలు అనాధలుగా మారి బతుకు వెళ్లదీస్తున్నారు. ఇదే విషయంపై ఎంతోమంది జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నాలు నిర్వహించినప్పటికీ మృతి చెందిన వారికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్పా.. శాశ్వత పరిష్కారం చూపించడంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పోలీస్, రవాణాశాఖ అధికారులు లారీ డ్రైవర్లపై నిర్లక్ష్యంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
- Tags
- asi harilal
- Death