భయానక ఘోర రోడ్డు ప్రమాదం.. ASI మృతి

by Sumithra |   ( Updated:2021-11-07 02:15:43.0  )
భయానక ఘోర రోడ్డు ప్రమాదం.. ASI మృతి
X

దిశ, రేగొండ : భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని గాంధీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన రేగొండ ఏఎస్ఐ హరిలాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం లారీనీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్‌లోని శివ నగర్‌కి చెందిన హరిలాల్ గత మూడు సంవత్సరాల నుండి రేగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story