ఫ్యాన్స్‌కు అశ్విన్ సలహా..

by Shyam |
ఫ్యాన్స్‌కు అశ్విన్ సలహా..
X

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ప్రజలు ఇండ్లలో నుంచి 21 రోజుల పాటు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో అందరూ తమ ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ వైరస్ భయాందోళనలతో అన్ని రకాల క్రీడా ఈవెంట్లు రద్దు కావడంతో ఆటగాళ్లు కూడా స్వీయనిర్బంధంలోనికి వెళ్లారు. అయినా సరే సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌ను అప్రమత్తం చేస్తూ.. సరదా పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సభ్యుడు రవిచంద్రన్ అశ్విన్ గత ఐపీఎల్ సీజన్‌లో వివాదాస్పదమైన ఒక ఔట్‌ను కరోనా లాక్‌ఔట్‌కు అనుకూలంగా మలుచుకున్నాడు. గతేడాది పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ‘మన్కడింగ్’ చేసి జాస్ బట్లర్‌ను అవుట్ చేశాడు. ‘మన్కడింగ్’ అంటే బౌలర్ బంతి వేయక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటినట్టయితే.. అతడిని రన్ అవుట్ చేయడం అన్నమాట. అప్పట్లో ఈ ఔట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇప్పుడు అశ్విన్ ఆ మన్కడింగ్‌ స్పూర్తిగా ఒక ట్వీట్ చేశాడు.

లాక్‌డౌన్ సమయంలో ఇండ్లు దాటి బయటకు వెళ్లకండి ఔటైపోతారు అని ట్వీట్ చేశాడు. అంటే అనవసరంగా బయటకు వెళ్లి వైరస్ బారిన పడొద్దు అని అర్థం వచ్చేలా పోస్టు చేశాడు. యాదృచ్చికంగా ఇది జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఇదే విషయాన్ని అశ్విన్ గుర్తు చేశాడు.

Tags: Ashwin, Indian Cricketer, Corona tweet, Mankading, Run Out

Advertisement

Next Story

Most Viewed