సింగపూర్‌లో హైదరాబాద్ వాసి ఆత్మహత్య..

by Anukaran |
సింగపూర్‌లో హైదరాబాద్ వాసి ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : సింగపూర్ దేశంలో హైదరాబాద్ వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మాదాపూర్‌లోని రిపోర్ట్ గార్డెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాజమాని అశోక్ వర్మగా గుర్తించారు. ఇటీవలే ఆయన తన కంపెనీని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఆయన మృతికి కారణమని సన్నిహితులు చెబుతున్నారు.

వివరాల్లోకివెళితే.. నగరానికి చెందిన అశోక్ వర్మ రిపోర్ట్ గార్డెన్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు. అయితే, అందులో పనిచేసే హుస్సేన్ అనే ఉద్యోగి కంపెనీ సిబ్బంది వివరాలు, డేటాను చోరీ చేశాడు. అతని కారణంగా అశోక్ వర్మ రూ. కోట్లు నష్టపోయాడు. దీంతో ఆర్థిక భారం పెరిగిపోవడంతో పాటు, ఉద్యోగి నమ్మకద్రోహాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై మాదాపూర్ పోలీసులకు అశోక్ వర్మ సోదరుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీ అడ్రస్ ఆధారంగా హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

Advertisement

Next Story