ఎలక్షన్ కమిషనర్‌గా అశోక్ లవాసా రాజీనామా

by Anukaran |   ( Updated:2020-08-18 05:25:09.0  )
ఎలక్షన్ కమిషనర్‌గా అశోక్ లవాసా రాజీనామా
X

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్‌గా అశోక్ లావాసా రాజీనామా చేశారు. ఈ నెల 31న విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా రాష్ట్రపతికి రాసిన రాజీనామాలో కోరారు. వచ్చే నెలలో ఫిలిప్పీన్స్‌లోని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ADB)కు వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. లవాసా ఎంపికను ఏడీబీ జులై 15న ప్రకటించింది.

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, మౌలిక వసతుల అభివృద్ధిలో లవాసాకు విశేషానుభవమున్నదని ఆ ప్రకటనలో వివరించింది. ఏడీబీ వైస్ ప్రెసిడెంట్ పదవీకాలం మూడు సంవత్సరాలుంటుంది. తర్వాత మరో రెండేళ్లు పొడిగించే వీలుంది. ఎన్నికల కమిషనర్‌ (Election Commissioner)గా మరో రెండేళ్ల పదవీకాలమున్న లవాసా అక్టోబర్ 2022లో రిటైర్ కావలసి ఉన్నది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలో ప్రధాని మోడీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షాకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఆయన వార్తల్లో నిలిచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే లవాసా భార్య, కొడుకు, కూతురుకు ఐటీ నోటీసులు జారీ అవ్వగా, ఆదాయ శాఖ ఆరోపణలు ఆయన కుటుంబం ఖండించింది.

Advertisement

Next Story

Most Viewed