అందంగా తయారైతే సరిపోతుందా..? : సీఎం

by Anukaran |   ( Updated:2020-07-15 06:49:53.0  )
అందంగా తయారైతే సరిపోతుందా..? : సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: అందంగా తయారైతే సరిపోదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్‌లో మాట్లాడమే కాకుండా.. భావజాలం, నిబద్ధత, దేశంలో కొంత స్థానం ఉండాలని హితవు పలికారు. సచిన్ పైలట్ వ్యవహారంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే, భారతీయ జనతా పార్టీపై కూడా గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం కోనుగోలు చేస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను పది రోజులు వదిలేస్తే బీజేపీ వైపు లాగేస్తోందని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రస్తుత రాజకీయాలు మారడానికి దానికి కారణం బీజేపీ అని దుయ్యబట్టారు.

Advertisement

Next Story