జీతాలు పెంచాలని నల్లబెల్లిలో ఆశావర్కర్ల ఆందోళన

by Shyam |
జీతాలు పెంచాలని నల్లబెల్లిలో ఆశావర్కర్ల ఆందోళన
X

దిశ, నల్లబెల్లి: ఆశా వర్కర్లకు నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా వారి హక్కులు కాలరాస్తూ.. శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని ఆశా యూనియన్, సీఐటీయూ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల అధ్యక్షురాలు తండ పావని అధ్యక్షతన ఆశా కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రవిగౌడ్ మాట్లాడుతూ… కరోనా ఫస్ట్ డోస్ 95%, రెండో డోస్ 75%వ్యాక్సిన్ పూర్తి చేయడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10వేలు ఇస్తుంటే ధనిక రాష్టం అని గొప్పలు చెప్తున్న తెలంగాణలో నిర్దిష్టమైన జీతం ఇవ్వకుండా.. శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారని ఆరోపించారు. పీఆర్‌సీ ప్రకటించి నాలుగు నెలలు దాటినా ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఆశా కార్యకర్తలకు ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనం రూ. 21వేలు చేసి ఉద్యోగులకు ఇస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పావని, రజిత, కళావతి, కవిత, జ్యోష్ణ, సుజాత, నీలాదేవి, వాసవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed