- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి
దిశ, వెబ్‌డెస్క్ : ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. కొందరు దుండగులు ఎంపీ ఇంటిని ధ్వంసం చేశారు. ఢిల్లీ అశోకా రోడ్డులోని అసద్ బంగ్లాపై దాడి చేసిన దుండగులు.. నేమ్ ప్లేట్లు, ట్యూబ్ లైట్లు మొదలైన వస్తువులను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఎంపీ అసద్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ దీపక్ యాదవ్ మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దాడితో ప్రమేయం ఉన్న ఐదుగురు హిందూసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అంతేగాక ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నాం.
దాడి ఘటనపై అసద్ మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఇంటిపైనే ఇలాంటి దాడులు జరిగితే ఎలా అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బీజేపీ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అయితే.. సుమారు 7-8 మంది ఇంటిపై దాడి చేశారని ఒవైసీ బంగ్లా నిర్వహకురాలు దీప తెలిపారు. కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ బంగ్లా మీదకు ఇటుకలు విసిరారు. దీంతో కిటికీలు, లైట్లతో పాటు ఇంటి ప్రవేశ ద్వారం ధ్వంసమైందని ఆమె వివరించారు.