జగన్ సాబ్.. జర రోకో: అసదుద్దీన్

by srinivas |
జగన్ సాబ్.. జర రోకో: అసదుద్దీన్
X

జగన్ సాబ్ జర రోకో అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. విజయవాడలో నిన్న రాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. సభ విజయవంతమైందన్న విషయాన్ని వెల్లడించే ఒక ఫోటోను ట్వీట్టర్ వేదికగా పోస్టు చేసిన అసదుద్దీన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ‘నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించాం. ఎన్పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్‌ను కోరుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story