ఒమిక్రాన్‌పై భయం వద్దు.. జాగ్రత్తలు పాటించండి

by Shamantha N |
ఒమిక్రాన్‌పై భయం వద్దు.. జాగ్రత్తలు పాటించండి
X

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్ పట్ల భయాందోళనలకు గురి కాకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. పరిస్థితిని ఎళ్లవేళలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ‘వైరస్‌ను ఎదుర్కోవడానికి తగిన వైద్య సదుపాయాలను సిద్దం చేస్తున్నాం. నగర వాసులు బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించండి’ అని చెప్పారు.

కాగా, ఆదివారం ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, ఇతర ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని పలుమార్లు కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా 30వేల ఆక్సిజన్ పడకలు, 10 వేల ఐసీయూ పడకలను సిద్ధం చేసినట్లు కేజ్రీవాల్ గత నెల 30న తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed